నారద వర్తమాన సమాచారం
బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి—గురజాల అప్పారావు
ఈ దేశ తొలి దళిత మాజీ ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్ అన్నారు. ఆదివారం మాచర్ల పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద బిజెపి మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో
ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
జోహార్ బాబు జగ్జీవన్ రామ్ కొనసాగిద్దాం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు అని నినాదాలు చేశారు
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దళితుల,అణగారిన వర్గాల హక్కుల కోసం వారి అభ్యున్నత కోసం కృషిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన యొక్క జీవితాన్ని,కృషి, పట్టుదలను యువత ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవలందించాలని కోరారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మాచర్ల నియోజకవర్గం మాజీ కన్వీనర్ గుమ్మడి నాసరయ్య మాట్లాడుతూ భారతదేశ సంస్కృతికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని భారత దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చి పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రావ్ అని ఆయన సేవలను కొనియాడారు.
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల అప్పారావు మాట్లాడుతూ దేశభక్తుడు సంఘసంస్కర్త రాజకీయ నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయం అన్నారు.
దళితుల కోసం ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిన మహా నాయకుడు బాబు జగజీవన్ రామ్ అని బిజెపి నాయకులు దర్శి కుమార్ అన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఐక్యంగా జరుపుకోవడం సంతోషం గా ఉందని బిజెపి మాచర్ల పట్టణ ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి ఈశ్వరయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పల్నాడు జిల్లా యువ నాయకులు గొబ్బూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








