Monday, April 6, 2026
spot_img

మాచర్ల పట్టణం లో మహిళపై అత్యాచార ఘటన పై నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల డిమాండ్…….

నారద వర్తమాన సమాచారం

మాచర్ల పట్టణం లో మహిళపై అత్యాచార ఘటన పై నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల డిమాండ్…….

మాచర్ల పట్టణం 13వ వార్డు లోనీ మహిళపై అత్యాచారం చేసి,దాడి చేసి గాయపరిచిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కుక్కమూడి ప్రసాద్ మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు, బీసీ నాయకులు
టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ది.2-4-2026 న మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దుండగులు దౌర్జన్యంగా మహిళా ఇంటిలోనికి ప్రవేశించి ఆమెను చేతులు కాళ్లు కట్టేసి బలవంతంగా అత్యాచారం చేసి దాడి చేసి గాయపరచి హత్య చేయడానికి గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించటం జరిగిందని,
ఈ సంఘటన జరిగి నేటికీ నాలుగు రోజులు గడుస్తున్న పోలీసు వారు దుండగులను గుర్తించకపోవడం బాధాకరమని,
ఈ సంఘటన వల్ల మాచర్ల పట్టణంలోని మహిళలు ,ప్రజలు భయపడుతూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని దినదిన గండంగా బ్రతుకుతున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని
ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులు నిందితుని గుర్తించడానికి ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయించాలని వారు అన్నారు
ఈ సంఘటన చాలా బాధాకరమని ప్రజాసంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై పోలీసు వారు ప్రత్యేక నిఘా పెట్టాలని, దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు
అనంతరం
ఈ సంఘటనపై సోమవారం మాచర్ల తహాశీల్దార్ కార్యాలయం నందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ వాణికి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఆమె స్పందించి ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తానని తెలియజేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading