నారద వర్తమాన సమాచారం
సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివి
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనైజేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు
సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివని ఆయన భారత సమాజంలో అణగారిన కులాల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే అని
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్నెస్ ఆర్గనేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల అప్పారావు అన్నారు
శనివారం మాచర్ల మాచర్ల పట్టణంలోని దళిత బహుజన
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురజాల అప్పారావు అధ్యక్షతన
మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా
అన్న క్యాంటీన్ ఎదురుగా ఉన్న
పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా గురజాల అప్పారావు మాట్లాడుతూ మాట్లాడుతూ సమాజంలోని కుల వివక్షను అంటరానితనాన్ని రూపుమాపటానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన అందించిన సేవలను కొనియాడారు
విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అట్టడుగు వర్గాలు విద్యాభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు
పూలే అని
పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ అన్నారు.
కార్యక్రమంలో బీసీ నాయకులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య సీనియర్ దళిత నాయకులు పొన్నాల ప్రవీణ్ కుమార్, కడియం అన్నారావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








