నారద వర్తమాన సమాచారం
అమరావతి అభివృద్ధికి నిధులు అందించనున్న వరల్డ్ బ్యాంకు….
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ఒక కీలకమైన ఆర్థిక ముందడుగు పడింది. అమరావతి రాజధాని మొదటి దశ అభివృద్ధి ( కోసం ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే 340 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను, అభివృద్ధి మైలురాళ్లను చేరుకోవడంలో చూపుతున్న పురోగతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిధులను కేటాయించినట్లు ప్రపంచ బ్యాంక్ ఉన్నతాధికారులు ధృవీకరించారు.
ఈ ఆర్థిక తోడ్పాటు ఇక్కడితో ఆగిపోకుండా, ఏప్రిల్ నెలాఖరు నాటికి మరిన్ని నిధులు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్ , ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి అదనంగా మరో 150 మిలియన్ డాలర్లను విడుదల చేసే అవకాశం ఉంది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం ప్రధాన రహదారులు, వరద నీటి కాల్వలు , తాగునీటి సరఫరా వ్యవస్థలు , నివాస సముదాయాల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వరద నిర్వహణ పనుల్లో సుమారు 35 శాతం పురోగతి నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా విడుదలైన నిధులు ఈ పనుల వేగాన్ని మరింత పెంచడానికి బూస్టర్ డోస్ లా పని చేయనున్నాయి.
మొత్తంగా అమరావతి మొదటి దశ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కలిసి 1.6 బిలియన్ డాలర్లను ఒక్కో సంస్థ 800 మిలియన్ డాలర్లు అందించడానికి అంగీకరించాయి. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతుగా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, వాతావరణ మార్పులను తట్టుకునేలా అమరావతిని ఒక నాలెడ్జ్ అండ్ గ్రోత్ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో ఈ నిధుల విడుదల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








