Friday, October 23, 2026
spot_img

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను సంయుక్తంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా IAS, జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి IPS

నారద వర్తమాన సమాచారం

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియను సంయుక్తంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా IAS, జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి IPS

పల్నాడు జిల్లా కలెక్టర్  కృతిక శుక్లా IAS , జిల్లా ఎస్పీ  జగదీష్ అదహళ్లి ఐపీఎస్  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు సందర్భంగా నామినేషన్ కేంద్రాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు.

ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన భద్రత కల్పించి, వారు తమ నామినేషన్లను ప్రశాంతంగా దాఖలు చేసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు.

ఎన్నికల ప్రక్రియను ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.

నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారులకు సూచించారు
.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS , జాయింట్ కలెక్టర్, జడ్పీటీసీ
ఎన్నికల రిటర్నింగ్ అధికారి  సంజన  హర్ష  నరసరావుపేట ASP M.హనుమంతు రావు
మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading