నారద వర్తమాన సమాచారం
నెల రోజుల్లోనే పాలనలో ప్రజాప్రభుత్వం స్పష్టమైన ముద్ర: ప్రత్తిపాటి
చిలకలూరిపేట 13, 14వ వార్డుల తెదేపా శ్రేణులు, ప్రజలతో ప్రత్తిపాటి సమావేశం
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన నెలరోజుల స్వల్ప వ్యవధిలోనే పాలనపై స్పష్టమైన ముద్ర వేయడం ఎంతో సంతోషం, సంతృప్తిని కలిగిస్తోందన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పైగా వైకాపా ప్రభుత్వం ఓడిపోతే సంక్షేమం ఆగి పోతుందని అభాండాలు వేసిన వారెవరూ ప్రజలకు మళ్లీ ముఖం చూపించుకోలేని స్థాయిలో సీఎం చంద్రబాబు సంక్షేమశకాన్ని చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తితో క్షేత్ర స్థాయిలో ప్రతిఒక్కరికీ ప్రచారం చేయాలని ప్రభుత్వం ప్రజలకు మధ్య పార్టీ కార్యకర్తలంతా సంధానకర్తలుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆదివారం చిలకలూరిపేట 13, 14వ వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ప్రత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమై వారి సమస్యలు ఆలకించారు. పట్టణ సమస్యలతో పాటు వార్డుల్లో నెలకొన్న సమస్యలు, నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీ ముఖ్యులపై విపక్ష వైకాపా చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలన్నారు ప్రత్తిపాటి. మరీ ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్ రెడ్డి, అతడి సతీమణి ఊరువాడా తిరిగి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లోఒక్కరికే అమ్మఒడి అనడంతో పాటు సవాలక్షకొర్రీలు పెట్టి లబ్దిదారుల సంఖ్య తగ్గించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ లోపాలన్నీ సరిచేసి, ఇచ్చే సాయం కూడా పెంచి తల్లికివందనం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని చూస్తున్నారని తెలిపారు ప్రత్తిపాటి. ఇది ఓర్వలేక కడుపుమంటతో వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమపద్ధతిలో నిలబెడుతున్నారన్నారని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.