నారద వర్తమాన సమాచారం
బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు.
అమరావతి:
బాధితులపైనే హత్య కేసు మోపిన గుంటూరు పోలీసులపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. నల్లపాడు పోలీసు స్టేషన్లో పెట్టిన ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ చేయాలని హోంమంత్రి ఆదేశింశారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే హత్య కేసు పెట్టి ఖాకీలు వేధింపులకు గురిచేసిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. నల్లపాడుకు చెందని శంకరలీలా తన కుమార్తెను కిడ్నాప్ చేశారని నల్లపాడు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన శంకర లీలాపై హత్య కేసు పెట్టి వేధింపులకు నల్లపాడు పోలీసులు గురిచేశారు. రెండు సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సంఘటనపై ఈ రోజు సచివాలయంలో హోంమంత్రిని కలిసి శంకరలీలా చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేసి ఖాకీలు వేధించారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే ఈ కేసును రీఓపెన్ చేసి ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని గుంటూరు పోలీసు ఉన్నతాధికారులకు హోం మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.