నారద వర్తమాన సమాచారం
రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న సాంస్కృతిక పర్యటక శాఖ మరియు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజా ప్రతినిధులు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా బిక్కనూరు మండలకేంద్రంలోని రైతు వేదికలో సాంస్కృతిక పర్యాటక,శాఖ మరియు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్, ఇతర ప్రజాప్రతినిధులు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. వరంగల్ రైతు డిక్లరేషన్ లా రాహుల్ గాంధీ ఇచ్చినమాటకు కట్టుబడి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూ. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా .. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలే కేంద్రబిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లకు దోసి పెట్టారని ద్వజమెత్తారు. విద్యా, వైద్య రంగాన్ని అద్వాన్నంగా తయారు చేశారని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎక్కువ సమయం కేటాయించాలని, వారి పట్లమర్యాదగా నడుచుకోవాలని అధికారులకు హితవు పలికారు. ప్రజా పిర్యాదులను పెండింగ్ లో పెట్టరాదని, వారం, పది రోజుల్లో వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన లో ప్యాకేజీల పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆహార సంక్షోభం నుండి ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన కార్యక్రమాల ద్వారా గట్టెక్కామని, ఆధునిక దేవాలయాలుగా పిలుచుకునే పోచంపాడు, నాగర్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ వరిధాన్యకారంగా మారిందని, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ ద్వారా సామాన్య ప్రజానీకానికి కూడా బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం లభించిందని, సోనియా గాంధీ వలన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, రాహుల్ గాంధీ ప్రకటించినట్టు ఈనాడు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడినఆరు నెలల కాలంలోనే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడంతో పాటు ఆరు ప్రభుత్వ గ్యారంటీలను నెరవేర్చిన ఘనత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానిదని అన్నారు. ఎవరు ఎన్ని పుకార్లు చెప్పినా నమ్మ వద్దని రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందని ఎవరికైనా ఇబ్బంది ఉంటే వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించాలని అన్నారు. జిల్లాలో 3 లక్షల 56వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత చేవెళ్ల పథకం కాలేశ్వరంగా మారిన తర్వాత పనులు ముందుకు సాగడం లేదని అన్నారు.జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడుతగా లక్ష రూపాయల రుణమాఫీ 49541 మంది రైతులకు 235 కోట్ల 61 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. ఏదైనా సాంకేతిక కారణాలతో రుణమాఫీ జాబితాలో లేని రైతులు వ్యవసాయశాఖ అధికారులను గాని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 7288894616 నెంబర్కు గాని సంప్రదించాలని అన్నారు.అనంతరం రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా అటవీ శాఖ అధికారి నికిత, కామారెడ్డి ఆర్డీవో రంగనాథ చారి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.