హైవే భూ నిర్వాసితులతో సమావేశం
నారద వర్తమాన సమాచారం
రైతులతో సమావేశం నిర్వహిస్తున్న చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
గౌరెల్లి నుండి భద్రాచలం హైవే పనులకు రైతులు సహకరించాలని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి కోరారు. పురపాలక కేంద్రంలో శనివారం మండల పరిషత్ కార్యాలయంలో గౌరెల్లి టు భద్రాచలం హైవే పనులు భూమి కోల్పోతున్న పిలాయిపల్లి, జగత్ పల్లి గ్రామాలరైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆయన హాజరై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తెలపాల్సిందిగా ఆయన రైతులతో కోరడం జరిగింది. పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన 57 మంది రైతులది 30 ఎకరాలు, జగత్ పల్లి గ్రామానికి చెందిన 25 మంది రైతులది 10.6 ఎకరాల 6 గంటలు భూమి కోల్పోతున్నరని ఆయన తెలిపారు. కాగా ప్రభుత్వం అందించే రేటు ప్రకారం ఎకరానికి 40 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని ఆయన తెలియజేశారు. వీరితోపాటు ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి , సర్వైయర్ సాయి తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.