నారద వర్తమాన సమాచారంస్త్రీమూర్తి ఒక మహాశక్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు కామారెడ్డి జడ్జి జే. శ్రీనివాసరావు అన్నారు..జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రావు కు ఆర్ అండ్ బి అతిథి గృహం లో పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన జిల్లా న్యాయమూర్తి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీకామారెడ్డి ,స్త్రీ మూర్తిఒక మహాశక్తి అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు కామారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జే. శ్రీనివాసరావు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి లో జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ సహకారంతో మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మహిళా సాధికారత పై(నారీశక్తి) ఆశ వర్కర్లు, అంగనవాడి టీచర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాలల విద్యార్ధినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జే.శ్రీనివాసరావు మహిళలు, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక మహిళా సంఘ సభ్యులు నిర్వహిస్తున్నది ఉద్యోగ బాధ్యతలు మాత్రమే కాదని వారు చేసేది ఒక సామాజిక సేవ అని అన్నారు. స్త్రీ అంటే ఒక సామాన్య వ్యక్తి కాదని ఒక మహాశక్తి అని చైతన్యవంతమైన మహిళా ఉండే ఇల్లు ఆదర్శవంతంగా ఉంటుందని, ఇల్లు ఆదర్శవంతమైనప్పుడే గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం దేశం ప్రపంచానికి ఆదర్శంగా తయారవుతుందని అన్నారు. భారతదేశం ప్రపంచంలో సముచిత స్థానం పొందాలంటే మహిళల ద్వారా ఇంటి నుండే చైతన్యం రావాలని అన్నారు. భారత రాజ్యాంగంలో లింగం, కులం, మతం, భాష లాంటి ఎలాంటి భేదం లేకుండా పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించిందని మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళల సంక్షేమం కోసం గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, పోక్సో చట్టం తదితర చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. గతంలో ఏమన్నా సమస్యలు ఉంటే కుల సంఘాలు, గ్రామ పెద్దలు పరిష్కరించడంతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు కేసులు ఎక్కువగా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు 100 సంవత్సరాలు పని చేస్తే తప్ప పరిష్కారం కానన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని అన్నారు. 1987లో న్యాయ సేవ సాధికార సంస్థ చట్టాలను తీసుకువచ్చారని ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని రకాల కేసులను మండల మరియు జిల్లాస్థాయి న్యాయ సాధికార సేవల సంస్థకు ఫిర్యాదు చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు. న్యాయ సేవ సాధికార సంస్థను సంప్రదిస్తే సమస్య పెద్దది కాకుండా పరిష్కారం సులువు అవుతుందని అన్నారు. విద్యార్థి జీవితం చాలా విలువైనదని సెల్ఫోన్లకు బానిస కాకుండా ఐఎస్ఐ, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారాన్ని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. నా స్వగ్రామం కామారెడ్డి పట్టణానికి సమీపంలో ఉందని నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కామారెడ్డి పట్టణం విద్యా, వైద్యం, వ్యాపారం రంగాలలో ఉన్నతంగా ఉండడం గమనించానని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు అని అన్నారు.
జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ సిహెచ్. విఆర్ఆర్. వర ప్రసాద్ మాట్లాడుతూ అవసరం ఉన్న పేదలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ పనిచేస్తుందని అన్నారు.ఈ సంస్థ ద్వారా న్యాయ సేవా సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించడం, పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ల ద్వారా రాజి చేకూర్చి పరిష్కరించడం మరియు న్యాయ సహాయం అందించడం జరుగుతుందని అన్నారు.జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సావలంబన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని ముఖ్యంగా మహిళశక్తి కార్యక్రమం ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు 14 రకాల యూనిట్లతో కూడిన స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని, వితంతు మరియు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, సఖి, డిసిపియు, తదితర కార్యక్రమాల ద్వారా గృహహింస గురైన మహిళలకు చేయూత అందించడం, బాల్య వివాహాలు జరగకుండా చూడడం, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో మహిళలు లైంగిక వేధింపుల నివారణకు ఇంటర్నల్ కమిటీలను వేయడం జరిగిందని అన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సింధు శర్మ మాట్లాడుతూ చట్టం మహిళల పక్షాన ఉందని గృహహింస,వరకట్న వేధింపు, లైంగిక దాడి, ఈవ్ టీజింగ్ లాంటి ఏ సమస్యలను మహిళలు ఎదుర్కొన్న న్యాయ సేవ సంస్థను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందని అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు. మహిళల చైతన్య ద్వారానే సమాజంచైతన్యమవుతుందన్నారు.కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు, బాలలకు ఉచిత న్యాయ సేవ అందించడానికి బార్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మొదటి అదనపు డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ దీక్ష ఇతర న్యాయవాదులు, న్యాయస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉదయం జిల్లాకు వచ్చిన హైకోర్టు జడ్జి జెశ్రీనివాసరావుకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పుష్యగుచ్చం అందించి స్వాగతం పలికిన జిల్లా న్యాయామూర్తి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.