నారద వర్తమాన సమాచారం
ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తక్షణమే అమలు చేయాలి.
తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందిస్తున్న బిజెపి ఓబీసీ మోర్చా నాయకులు
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పురపాలక కేంద్రంలో సోమవారం పట్టణ బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంగాపురం శ్రావణ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫస్ట్ లో భాగంగా బీసీలకుఇచ్చిన హామీలను అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగ తాసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి కి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారం కోసం బీసీలను మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి సుమారు 8నెలలు అవుతున్న ఇచ్చిన మేనిఫెస్టో ఒక్క హామీని కూడా అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు. చెప్పిన హామీల ప్రకారం బిసి కుల గణన వెంటనే చేపట్టి స్థానిక ఎన్నికల్లో 42 రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. గొల్ల, కురుమలకు వంద రోజుల్లోనే గొర్రెలను పంపిణీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టకపోవడం ఎంతవరకు సభకు అని ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్ ను సంవత్సరానికి 20 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పి ఎనిమిది నెలలైనా కూడా ఒక్క రూపాయి కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారని వారన్నారు. బీసీ విద్యార్థులకు 100% ఫీజు రిమెంబర్ మెంట్ వెంటనే చేపట్టాలని దీనితోపాటు మత్స్యకారులకు ఉచిత చాప పిల్లల పంపిణీ చేపట్టలేదని అన్నారు. బీసీ కులాలకు ఇస్తానన్న హామీలను వెంటనే చిత్తక్షణమే చర్యలు చేపట్టి అమలు చేసే విధంగా ప్రభుత్వం పని చేయాలని లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, మండల అధ్యక్షుడు రాజు యాదవ్, టౌన్ అధ్యక్షుడు డబ్బికారు సాహిష్, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు గంజి బసవలింగం, సీనియర్ నాయకులు నోముల గణేష్, టౌన్ ప్రధాన కార్యదర్శి గొలనుకొండ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకు వెంకటేష్ , టౌన్ మహిళా మోర్చా బండిరాల సుశీల, టౌన్ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీకాంత్, చీరాల లింగయ్య, పల్లకాడి బసవయ్య, తండ రమేష్ గౌడ్, జంగయ్యగౌడ్, చిటుకుల అంబదాస్, మూటపురం రవి, వంగూరు సిద్ద, నరేందర్, దోర్నాల సతీష్, పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.