నారద వర్తమాన సమాచారం
నిర్మలమ్మ బడ్జెట్ పై పెదవి విరిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి జిల్లా
నిర్మలమ్మ బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ పెదవి విరిచారు.
దేశంలో మైనార్టీలు దళితులు మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని, కానీ బడ్జెట్‌లో మహిళల భద్రత ఊసెత్తలేదని అన్నారు.
ఆంధ్ర, బీహార్ కు ప్రకటించిన దాంట్లో తెలంగాణకు 25 శాతం కూడా ప్రకటించలేదు
వారికి ఎందుకిచ్చారు అని మేము అడగటం లేదు మాకు కూడా న్యాయం చేసి సమానంగా నిధులు ప్రకటించి వుంటే బాగుండేది
మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా పధకాలను తీసుకొస్తున్నామంటున్నా వాటి అమలుపై మాత్రం శ్రద్ధ కనబరచడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని మండిపడ్డారు.
బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.
రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం వాళ్లు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి దక్కింది శూన్యమే అని పేర్కొన్నారు.
రాష్ట్రం నుండి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు గెలిచిన కేంద్రం మాత్రం తెలంగాణకు చిన్నచూపు చుసింది ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు అని తెలిపారు.
ఐఐఎం సహా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇస్తారేమో అని ఎదురుచూసిన ఒక్కటి కూడా ఇవ్వలేదు.
తెలంగాణ నుంచి ముంబై- నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు.
మెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అన్ని శాఖల మంత్రులను అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు.
తెలంగాణలో 8 స్థానాలను బీజేపీ, పార్టీకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.
బీజేపీ, ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదు.
ధరల మంటను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నిత్యావసరాల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.