కనీస వేతనాలు అమలు చేయమంటే అరెస్టుల కామరెడ్డి సీఐటీయూ ఖండనా
నారద వర్తమాన సమాచారం
కామారెడ్డి జిల్లా
ఆశ, గ్రామపంచాయతీ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండించండి సి ఐ టి యు మంగళవారం రోజు చలో హైదరాబాద్ వెళ్తున్న ఆశా కార్మికులను, గ్రామపంచాయతీ కార్మికులను అక్రమ అరెస్టులకు పాల్పడడానికి సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. గత 20 రోజులకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు పరచాలని, ఆశా కార్మికులు పారితోషికాలు వద్దు కనీస వేతనాలు ఇవ్వాలని, జాబ్ చార్ట్ విడుదల చేయాలని, సంబంధం లేని పనులు చేయించరాదని, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశలు గ్రామపంచాయతీ కార్మికులు చలో హైదరాబాద్ వెళుతుండగా జిల్లాలో ఎక్కడికక్కడ అయ పోలీస్ స్టేషన్లో ఆశలను గ్రామపంచాయతీ కార్మికులను అక్రమంగా నిర్బంధించడాన్ని సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ సిఐటియు. వ్యవసాయం జిల్లా కార్యదర్శి కొత్త నర్సిములు. సిఐటియు నాయకులు రాజనర్సు తీవ్రంగా ఖండించారు. కార్మికులను వెళ్లకుండా బస్సులను తనిఖీ చేయడం, రైల్లను తనిఖీ చేయడం , ప్రైవేట్ వెహికల్స్లో కూడా వెళ్లకుండా నిర్బంధించడం. అరెస్టులకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కార్మికులు టిఆర్ఎస్ ను గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే అదే పద్ధతి తో ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని వారు విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం స్కీములన్నిటిని ప్రైవేటీకరించడానికి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దానికి వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకుండా, బిజెపి అడుగులోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని వారు విమర్శించారు.కామారెడ్డి టౌన్ , వన్ టౌన్ రూరల్ , అన్ని పోలీస్ స్టేషన్లో వందలాది మంది ఆశాలను గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికులను అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ స్పందించి గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు పరచాలని. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు పరచాలని. ఆశా కార్మికులకు కనీస వేతనాలు 18000 ఇవ్వాలని. రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనీ చో మరిన్ని పోరాటాలకు ఆశ గ్రామపంచాయతీ కార్మికులు సిద్ధమవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందులో ఆశ జిల్లా నాయకులు కామారెడ్డి నాయకులు రాజనర్సు . సత్యం. శ్రీను. ఇందిరా. రాజశ్రీ. పద్మ. మంజుల.భాగ్య. సంధ్య.సంగీత. అనిత. కృష్ణవేణి,జయశ్రీ,స్వరూప,పల్లవి,విజయా. పుష్ప. సుధరణి. నాగమణి.మణెమ్మ. నర్సిన్. నాగమణి.తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.