Friday, November 22, 2024

గుత్తికొండ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా ఫారెస్ట్ అధికారి రామచందర్రావు

నారద వర్తమాన సమాచారం

గుత్తికొండ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన

జిల్లా ఫారెస్ట్ అధికారి
రామచందర్రావు

పిడుగురాళ్ల

పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండగ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రదేశంలోకి శుక్రవారం పల్నాడు జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్ర రావు పరిశీలించటం జరిగింది. ఆ ప్రదేశంలో కొంత అటవీ ప్రదేశాన్ని ఆక్రమణలు చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేసినట్లు జిల్లా అధికారి రామచంద్రరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ భూమిని ఆక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఎవరైనా సరే అటవీని పర్యావరణానికి నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. అటవీ ప్రాంతాన్ని, అడవిని, నరుకుట, చదును చేసి పొలాలు చేయటం చట్టరీత్యా నేరమని శుక్రవారం సందర్శించిన ప్రదేశాన్ని పొలాలు సాగు చేయకుండా, వివిధ రకాలైన మొక్కలు నాటి ఆ ప్రదేశాన్ని ఒక వనంగా తీర్చిదిద్దబోతున్నామని, ఇక ఎవరైనా సరే అటవీ భూమిని ఆక్రమణలు చేయాలని చూస్తే చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామని తెలిపారు. ఆయన వెంట నరాసరావుపేట రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ, నకరికల్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నీలిమాదేవి, బీట్ ఆఫీసర్ మనోజ్ కుమార్, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading