నారద వర్తమాన సమాచారం
ఆదివారం అమావాస్యనాడు ఆచరించాల్సినవి ..!
ఆషాడం ముగిసే సమయం ఆదివారం అమావాస్య చాలా విశేషం అమ్మవారికి అంబిలి నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవాలి కొందరికి అంబిలి పంచడం మంచిది.
మాంసాహారం తినే వారు ఆదివారం అమావాస్య రోజు తినకపోవడం మంచిది
ముఖ్యంగా కాళీ ఉపాసకులు అమ్మవారికి ఇప్పనూనె తో దీపం పెట్టి అరటిపండ్లు, కదంబం నివేదన చేసి కకార కాళి స్త్రోత్రం పారాయణ చేయడం చాలా మంచి ఫలితం ఇస్తుంది ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి అయితే ఈ పూజ సాయంత్రం చీకటి పడ్డాక చేయాలి.
ఆదివారం అమావాస్య రోజు రాహుకాలం లో దుర్గా దేవికి అభిషేకం కుంకుమార్చన స్త్రోత్రం పారాయనఁ దీపాలంకరణ సేవతో బెల్లం అన్నం నైవేద్యం ఇలా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలి ఎటువంటి సమస్యలు ఉన్నవారు అయినా రాహుకాలంలో ముక్యంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజు దుర్గమ్మ పూజ చేస్తుంటే వారికి ఆ ఆటంకాలు తొలగిపోతాయి.
క్షిప్ర గణపతి ఆరాధన ఆ ఒక్క రోజు చేసే విధానంలో చేస్తే 6 రోజుల్లో ఫలితం ఉంటుంది అని పెద్దలు అంటారు..
ఉప్పు లేకుండా గారెలు చేసి బైరవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసాక అవి వీధి కుక్కలకి ఆహారం గా పెడితే కోర్ట్ సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆపదుత్తరదుర్గా స్త్రోత్రం అర్జున విరచితం స్త్రోత్రం 16 సార్లు పారాయణం చేస్తే మంచిది.
ఆ రోజు స్వగృహంకి, సొంత వ్యాపారం ఉన్న వారు ,వాహనాలు ఉన్నవారు అన్నిటికి దిష్టి తియ్యాలి, చీకటి పడ్డాక మీరు మీ పిల్లలు దిష్టి తీసుకుంటే మంచిది.
గుమ్మడికాయ కుళ్ళితేనే మార్చాలి , దిష్టి తియ్యడం కోసo అది తియ్యకుండా కొత్తది తెప్పించి కొట్టాలి..
అమావాస్య లక్ష్మీ దేవి పూజ ధనాకర్షణ లభిస్తుంది
మొండిగా ఉన్న వారు అనారోగ్యంతో ఉన్నవారు చిత్తచాపల్యం ఉన్న వారు ఎవరికి ఏ స్వభావం ఉంటే ఆ గుణం ఆరోజు అధిక ప్రభావం చూపుతుంది దానివల్ల ప్రమాదాలకు గురు ఐయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇంట్లోనే ఉండటం మంచిది.
ఉదయం అంబిలి నివేదనతో అమ్మవారి పూజ, రాహుకాలం లో దుర్గా (కాళీ) ఉపాసన కదంబం, గూడాన్నం (బెల్లం అన్నం) ,అరటిపండు నైవేద్యం, కకార కాళీ స్త్రోత్ర, దుర్గా స్త్రోత్రం పారాయణం, కుంకుమార్చన, సాయంత్రం భైరవ ఆరాధన వారాహి వ్రతంతో ఉన్నవారు వారాహి పూజ ఇలా జరుపుకోవాలి
ముఖ్యంగా ఇంట్లో ఈ మధ్య కాలంలో కాలం చేసిన వారికి సాంబ్రాణి వేయాలి భోజనం నైవేద్యం పెట్టాలి కాకికి అన్నం పెట్టాలి ఇది చాలా ముఖ్యం వారి ఆత్మకు శాంతి మీకు మంచిది…
శ్రీ మాత్రే నమః
Discover more from
Subscribe to get the latest posts sent to your email.