నారద వర్తమాన సమాచారం
తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసి ప్రపంచ దినోత్సవ వేడుకలు
సుప్రీం కోర్టు లో ఎస్సి, ఎస్టీ వర్గీకరణ సంచలన తీర్పును స్వాగతిస్తున్నాం
ఎన్నడూ లేని విధంగా గిరిజన హక్కులపై దాడి
తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాదనపురం రఘు
జై మూలవాసి జై ఆదివాసి జై ఏకలవ్య
ఎల్ బీ నగర్
సుప్రీం కోర్టులో ఎస్టీ, ఎస్ సి సంచలన వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి బదనాపురం రఘు తెలిపారు. ఆదివాసి ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లెల్ కూడా చెరువు కట్ట వద్ద తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేశారు తెలంగాణ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి బదనాపురం రఘు హాజరై స్థానిక నాయకులతో కలిసి ఆదివాసి ప్రపంచ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా అయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన తెగలు ఆగస్టు 9న ప్రపంచ గిరిజన హక్కుల దినంగా జరుపుకోవాలని 1994లో ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఆదివాసి గిరిజన తెగల హక్కులను రక్షించడం, సమాజ పరిణామ క్రమంలో తెగలు నిర్వహించిన పాత్రను గుర్తించడం, పర్యావరణ పరిరక్షణకు వారి మద్దతును కోరడం, స్వయం పాలనాధికారంలో భాగస్వాములుగా చేయడం, ఉమ్మడి సంస్కృతి, జీవన విధానం, భాష ఆచార వ్యవహారాలను గౌరవించడం విద్యా, ఆరోగ్యంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు పాలక ప్రభుత్వాలు కృషి చేయాలని చెపుతూ గిరిజన తెగలు తమ హక్కులను సాధించుకునేందుకు ఆగస్టు 9న గళమెత్తాలని ఐక్యరాజ్యసమితి తీర్మానంలో పేర్కొన్నది.
2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల మంది ఆదివాసీ గిరిజన తెగల జనాభా ఉన్నది. మనదేశంలో 720 తెగలు 8.6 శాతంతో 10 కోట్ల 43 లక్షల మంది ఉన్నారు. 2021 జనాభా లెక్కలు తీస్తే 15 కోట్లకు చేరే అవకాశం ఉంది.
వివిధ దేశాల్లో వివిధ రకాల పేర్లతో గిరిజన తెగలను పిలుస్తున్నారు. వివిధ తెగల సమూహాలన్నిటినీ ఇండిజినెస్ పీపుల్,స్థానిక తెగలుగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ఇచ్చింది. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించారు.
*ఎన్నడూ లేని విధంగా గిరిజన హక్కుల పై దాడి.
గిరిజన తెగలకు అడవులకు అవినాభావ బంధం శతాబ్దాలుగా కొనసాగుతున్నది. అడువులపై అన్ని హక్కులు మాకే సొంతమని భావిస్తూ స్వేచ్ఛగా జీవనం సాగిస్తూ వస్తున్నారు.
బ్రిటిష్ వారి రాకతో గిరిజన తెగల స్వేచ్ఛపై మొదటిసారిగా సంకెళ్లు పడ్డాయి. అటవీ సంపదను దోపిడీ చేయడం కొరకు అడవుల్లో గిరిజన తెగలను నియంత్రించారు.
కఠినమైన నల్ల చట్టాలను అమలు చేశారు. బ్రిటిష్ నిర్బంధకాండకు వ్యతిరేకంగా దేశంలో మొట్టమొదటిసారిగా గిరిజన తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి.
ఈ తిరుగుబాట్లు బ్రిటిష్ వారికి ముచ్చమటలు పట్టించాయి. తిరుగుబాట్లను చల్లార్చడానికి తప్పని పరిస్థితుల్లో గిరిజన తెగలకు హక్కులు కల్పించాల్సి వచ్చింది. స్వాతంత్ర్యానంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఏర్పడిన రాజ్యాంగ కమిటీ గిరిజన తిరుగుబాట్ల స్ఫూర్తితో హక్కులను గుర్తించింది.
1950 జనవరి 26 న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన తెగలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు,వెసులుబాట్లను కల్పించింది.
గిరిజన తెగలు అధిక సాంద్రత కలిగిన రాష్ట్రాలలో ఆరవ షెడ్యూల్ ప్రాంతాలుగా, దిగువసాంద్రత కలిగిన రాష్ట్రాలలో ఐదవ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించింది. ఇక్కడ భూములపై గిరిజన తెగలకు మాత్రమే హక్కులుంటాయి.
గిరిజనేతర ప్రజలకు హక్కులను నిషేధించింది. భూ బదలాయింపు నిషేధ చట్టం 1/70 ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతాల్లో సైతం అమల్లో ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్టికల్ 371 ఎ,బి,సి, ఈ,హెచ్ వరకు ఉన్న అధికరణల్లో గిరిజనులకే భూమిపై హక్కులతో పాటు పరిపాలనలో గిరిజన తెగలకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్నది. స్వయంపాలిత మండళ్లు,కౌన్సిల్స్, ప్రత్యేక శాసనసభలను ఏర్పాటు చేయాలన్నది.
షెడ్యూల్ ప్రాంతాలపై సర్వాధికారం భారత రాష్ట్రపతికి ఇచ్చింది. రాష్ట్రాల్లో గవర్నర్ల సహకారంతో నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నది. ఆయా రాష్ట్ర అసెంబ్లీలో చేసే తీర్మానాలు చట్టాలు యధావిధిగా షెడ్యూల్ ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 243 అనుసరించి 1996లో పంచాయతీరాజ్ షెడ్యూల్ ఏరియా విస్తరణ చట్టం (పెసా) ను తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి పేరుతో జరిగే ప్రాజెక్టులు, కాలువలు, పరిశ్రమలు, మైనింగ్ కార్యకలాపాలన్నీ స్థానిక గిరిజన పంచాయితీల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ సంచలన వర్గీకరణకు తీర్పుని సాగశిస్తున్నాం
ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై కమిషన్ ని ఏర్పాటు చేస్తూ ఉపతెగలు లో ఆర్థిక అసమానతలు వారి సంక్షేమం, ఉపాధి రాజకీయంగా చట్టసభల్లో అవకాశమిచ్చినప్పుడు ఉప తెగలు ఆత్మగౌరవంతో జీవిస్తారు.
ఈ కార్యక్రమం లో స్థానిక ఏకలవ్య ఎరుకల సంఘం పెద్దలు కుతాడి శంకర్, బాలాపూర్ మండల అధ్యక్షుడు కూతాడి రామకృష్ణ సీనియర్ నాయకులు ఎరుకల గాలేటి కార్తీక్, హనుమంతు సురేష్, దేవసరి పాండు, ఎరుకల మహిళ సోదరి, తదితరులు హాజరై ఘనంగా నిర్వహించడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.