నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఐఏఎస్.,తో కలిసి పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్.,
నరసరావుపేట పట్టణం లోని కోడెల శివప్రసాద్ మైదానంలో గురువారం జరుగునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ పరిశీలించారు.
ఆగష్టు15న ఘనంగా జరిగే 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు , విఐపి ల గ్యాలరీలు , సకటాల ప్రదర్శన, వీక్షించేందుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం గ్యాలరీలు, తదితర వంటి ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ పతాక ఆవిష్కరణ, తదితర వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలు,ఉన్నతాధికారులుప్రజలకు కల్పించాల్సిన భద్రత మరియు సౌకర్యాలను సమీక్షించారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాట్లతో ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించినారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రారంభం నుండి ముగిసే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని,వాహనాల పార్కింగ్ నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఆర్ .రాఘవేంద్ర , అదనపు ఎస్పీ ఏఆర్ రామచంద్రరాజు , అదనపు ఎస్పీ క్రైమ్ లక్ష్మిపతి , ఎస్బి సిఐ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.