నారద వర్తమాన సమాచారం
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక
అమరావతి:
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బొత్సకు ఎన్నిక ధ్రువీ కరణ పత్రాన్ని అందజేశారు రిటర్నింగ్ అధికారి.ఈ సంద ర్భంగా బొత్స సత్యనారా యణ మాట్లాడుతూ..
వరలక్ష్మీ ఆశీసులతో రాష్ట్ర ప్రజలు శుభంగా ఉండాలని శ్రావణ శుక్రవారం రోజున కోరుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీ వంగా ఎన్నికైనట్టు జేసీ సర్టిఫికెట్ అందజేశారని తెలిపారు.
తనకు బీ ఫామ్ ఇచ్చి పోటీకి దింపిన జగన్ కు,తమ నాయకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.రాబోయే కాలంలో జిల్లా అభివృద్ధే ద్యేయంగా, ఒకే మాటతో, ఒకే విధానంతో పనిచేస్తా మని చెప్పారు.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలోని కూటమి పోటీ చేయలేదన్న విషయం తెలిసిందే. నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి షఫీ దాన్ని ఉపసంహరించు కున్నారు.
మొదట ఈ ఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ-జనసేన -బీజేపీ కూటమి భావించిం ది. ఎన్నిక బరిలో ఓ పారిశ్రా మికవేత్తను కూడా నిలుపు తారని ప్రచారం జరిగింది. చివరకు ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.