పూర్తి స్థాయి బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు..
సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం..
ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని కోరిన ఆర్థిక శాఖ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు కానుంది. బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నతాధితారులకు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని అంచనాలు పంపాల్సిందిగా ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఇక, ఈ నెల 31వ తేదీలోగా అన్ని శాఖలు బడ్జెట్ అంచనాలను పంపాలని ఆర్థిక శాఖ కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్టుతో ఏపీ సర్కార్ నెట్టుకొస్తుంది.
ఇక, మరోవైపు, కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షాలకూ ఇదే విషయాన్ని విన్నవించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.