నారద వర్తమాన సమాచారం::సతైనపల్లి:ప్రతినిధి
ద్విచక్ర వాహన యాత్రలకు స్పందన
కీలకమైన గ్రామాలలో పర్యటిస్తున్న అంబటి
గ్రామాల్లో సమన్వయమే లక్ష్యం
పాకాలపాడు పర్యటనలో మంత్రి అంబటి
సత్తెనపల్లి
సార్వత్రిక ఎన్నికలవేళ క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కీలకమైన గ్రామాలలో రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు అంబటి రాంబాబు వినూత్నం గా బుల్లెట్ పై పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులందరూ వందలాది సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై అంబటిని అనుకరిస్తున్నారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న యాత్ర ఆసక్తికరంగా సాగుతోంది. సత్తెనపల్లి రూరల్, పట్టణం, ముప్పాళ్ళ మండలాల్లోని కీలకమైన గ్రామాలను ఎంపిక చేసుకొన్నారు. అక్కడి లోపాలను సవరించుకునేందుకు , పార్టీకి దూరంగా ఉన్నవారని అక్కున చేర్చుకునేందుకు, సమన్వయ లోపాన్ని సరిచేసి నాయకులందరినీ ఏకతాటిపై తీసుకువస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో గ్రామాలకు చేరుకొని స్థానికంగా ఉన్న నేతలతో సమన్వయ చేసుకుని ప్రజలతో మమేకమవడం తో గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. పార్టీ , నాయకులంతా ఐక్యంగా పనిచేస్తున్నారని, గెలుపు తధ్యమనే భవనాలు శ్రేణుల్లో తీసుకు రాగలిగారు.
బుధవారం సత్తెనపల్లి మండల పరిధిలోని పాకాలపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. స్థానిక నాయకులందరినీ పరామర్శించారు. పలకరించారు. గ్రామ నాయకత్వాన్ని అందరిని ఏకతాటిపై తీసుకోవచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని మీకున్న రెండు ఓట్లను ఒకటి నాకు , మరొకటి ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ వేయాలని ఆయన అభ్యర్థించారు .పేదల పక్షాన అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని కోరారు. గ్రామంలో చిన్నారి జన్మదిన వేడుకల్లో అంబటి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక యువకులు మహిళలు కనబడుతూ సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. కార్యక్రమంలో రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.