నారద వర్తమాన సమాచారం:క్రోసూరు:ప్రతినిధి
ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
రోజురోజుకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కోరారు బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు ఒకటవ సచివాలయం ఆవరణలో వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత వడగాల్పుల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు స్థానిక టీవీ చానల్స్ తో పాటు రేడియోలో వార్తలు వింటూ వార్తాపత్రికలు చదువుతూ ఎండ తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎండ తీవ్రత పై అప్రమత్తంగా ఉంటూ మరిన్ని సూచనలు పాటించాలన్నారు ఎండలోకి వెళ్లేటప్పుడు నెత్తికి టోపీ పెట్టుకోవాలి లేదా రోమాలు కర్చీఫ్ కట్టుకొని తెల్లని కాటన్ వస్త్రాలు ధరించండి అదేవిధంగా కళ్ళకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి వీలైనంతవరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి దాహం వేయకపోయినా తరచుగా నీటిని త్రాగండి ఉప్పు కలిపిన మజ్జిగ గ్లూకోజు ఓఆర్ఎస్ కలిపిన నీటిని త్రాగండి వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన చికిత్స చేయించాలి ఎండలో నుండి వచ్చిన వెంటనే నీరు గాని నిమ్మకాయ రసం గానీ కొబ్బరి నీరు గాని త్రాగాలి తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తల తిరుగుట వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గర్లో వైద్యున్ని సంప్రదించాలి ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడని పనులు గూర్చి ఆయన వివరిస్తూ ఎండలో గొడుగు లేకుండా తిరగరాదన్నారు వేసవికాలంలో నలుపు రంగు మందంగా ఉండే దుస్తులు ధరించకూడదన్నారు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యకాలంలో బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు వడ దెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన ప్రధమ చికిత్స గూర్చి ఆయన వివరించారు వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి అన్నారు చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి ఎవరైనా వడదెబ్బకు గురైతే వారిని వెంటనే నీడలో పడుకోబెట్టి వారి దుస్తులు వదులు చేయాలి ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన ద్రావణం లేదా ఓరల్ రిహైడ్రేషన్ ద్రావణం తాగించాలి వీలైనంత త్వరగా దగ్గర్లో ఆసుపత్రికి తరలించాలి ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి మాట్లాడుతూ శరీర ఉష్ణోగ్రత పెరగడం వణుకు పుట్టడం మగత నిద్ర లేదా కలవరింతలు ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఆరోగ్య కార్యకర్త అనుపమ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.