నారద వర్తమాన సమాచారం
ఉల్లి ధరలు తగ్గించాలి – వినియోగదారుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు డా. చదలవాడ హరిబాబు
అన్నమయ్య జిల్లా :
తిరుపతి పట్టణం లోని మాల్స్, రైతు బజార్లు లో ప్రభుత్వము సబ్సిడీ క్రింద విక్రయిస్తున్న బియ్యం, కందిపప్పుల నాణ్యత పరిశీలించి వాటిని విక్రయించే స్థలం వద్ద ఫ్లెక్సిలు ఏర్పాటు చేయాలని వినియోగదారుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు డా. చదలవాడ హరిబాబు సూచనలు చేసారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయలు కిలో రూ.80/-లు అమ్ముతున్నారని, మార్కెట్ ఇంటర్వెన్షన్ పధకము క్రింద ధరల నియంత్రణ కమిటీ సమావేశములు జాయింట్ కలెక్టర్ అధ్వర్యంలో సమావేశపరచి ఉల్లిపాయల ధరలు తగ్గించి సబ్సిడీ క్రింద వినియోగదారులకు అందించాల్సిన అవసరం గురించి ప్రభుత్వానికి తెలియజేయాలని హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి, మల్లిఖార్జున రావు, వెంకటేశ్వర రావు, ప్రసాదం పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.