నారద వర్తమాన సమాచారం
విజయవాడ వరద బాధితులకు సాయం అందించిన క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది
పల్నాడు జిల్లా కలెక్టర్, డి ఎం హెచ్ ఓ రవి ల విజ్ఞప్తి మేరకు పల్నాడు జిల్లా కోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు సిరి చందన, మహమ్మద్ షాద్ ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ నేతృత్వంలో క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది వరద బాధితులకు వాటర్ బాటిల్ లు , బిస్కెట్ ప్యాకెట్లు, క్యాండిల్స్ తదితర నిత్యవసర వస్తువులకు సంబంధించినటువంటి సామగ్రిని డీఎంహెచ్ఓ కార్యాలయం ద్వారా వరద బాధితులకు పంపినట్లు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ బుధవారం తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ విజయవాడను వరద విపత్తు అతలా కుతలం చేసినటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి స్ఫూర్తితో సిబ్బంది అందరూ సాటి మానవులను ఆపత్కాలంలో ఆదుకోవడం నాకెంతో సంతృప్తినిచ్చిందని ఇలాంటి నిజమైన సేవ ద్వారానే ఆనందం దొరుకుతుందని మానవసేవే మాధవ సేవ అన్నారు ఈ కార్యక్రమమునకు తమ వంతు సహకారం అందించిన పిహెచ్సి సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా హెల్త్ అసిస్టెంట్ ఫ్రాంక్లినుకు ధన్యవాదాలు తెలిపారు రెండు రాష్ట్రాల్లో మళ్ళీ అతి త్వరలోనే సాధన పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.