నారద వర్తమానసమాచారంవినాయకచవితి సందర్బంగా దాచేపల్లి పోలీస్ వారి సూచనలు:దాచేపల్లి మండల ప్రజలకు తెలియజేయునది ఏమన వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మంటపం ఏర్పాటు చేయు కమిటి సభ్యులు, వినాయక మంటపం మరియు వినాయక నిమర్జనం సమయంలో ఈ క్రింది నియమాలు తప్పక పాటించవలెను.1. ఎటువంటి ప్లేక్సీలకు అనుమతి లేదు.2. వినాయక మంటపం వద్ద కమిటి వారు CC Camera లు తప్పకుండ ఏర్పాటు చేసుకోవలెను. లేదా 24 గంటలు ఒక వ్యక్తి మండపంలో ఉండవలెను. ఏ సమస్య వచ్చిన కమిటి వారే భాధ్యత వహించవలెను. పోలీస్ వారికి తెలియజేయవలెను.3. వినాయక నిమర్జన సమయంలో Videography తప్పనిసరి.4. వినాయక మంటపం ఏర్పాటు చేయు స్థలంలో ఎటువంటి వివాదం ఉండకూడదు, ఒకవేళ సదరు స్థలం ప్రైవేటు వ్యక్తిది అయ్యిఉంటే స్థల యజమాని అనుమతితప్పనిసరి.5. మత హింసకు సంబదించిన గొడవలు ఉండకూడదు.6. వినాయక మంటపం వద్ద సరైన వెలుతురు ఉండి కనీసం 5 LED లైట్లు ఏర్పాటు చేసుకోవలెను.7. వినాయక నిమర్జన ఊరేగింపులో 100 మందిని మించి ఉండకూడదు మరియు ప్రసాద పంపిణీలు ఉండకూడదు.8. వినాయక నిమర్జనం వెళ్ళు మార్గంలో కరెంట్ అడ్డంకులు ఉండకూడదు.9. వినాయక నిమర్జన సమయంలో చిన్న పిల్లలను మరియు వృద్ధులను అనుమతించరాదు.10. DJకి పర్మిషన్ లేదు.11. వినాయక నిమర్జనం ముందు రోజు పోలీస్ వారికీ తెలియపరచవలెను.12. బాణసంచకు అనుమతి లేదు.ఇట్లుదాచేపల్లి పోలీస్CI:9440769239, SI: 9381298412.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.