నారద వర్తమాన సమాచారం
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే యరపతినేని
పల్నాడుజిల్లా
దాచేపల్లి:-
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామం నందు ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయిన సందర్బంగా “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” 2వ రోజు కార్యక్రమం దాచేపల్లి మండలంలో పలు గ్రామంలో శనివారం ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
వందరోజులు ఎన్డీఏకూటమి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత “ఇది మంచి ప్రభుత్వం” అని అనిపించుకున్నారని యరపతినేని అన్నారు
అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే “అన్న క్యాంటీన్లు”, యువత భవిష్యత్తుకు “మెగాడీఎస్సీ” ప్రజల ఆస్తుల భద్రతకు,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట రద్దు,వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు.
దాచేపల్లి మండలం కాట్రపాడు గ్రామం నందు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా, ఈ వంద రోజుల్లో సాధించిన విజయాలు, ప్రగతిని ప్రజలకు వివరించిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది.
అలాగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాచేపల్లి మండలం బట్ర పాలెం మరియు కాట్రపాడు గ్రామాల పర్యానటలో ముందుగా బట్రపాలెం లోని శ్రీ లక్ష్మి నర్ససింహాస్వామి వారిని దర్శించుకున్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మరియు శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి
ఈ కార్యక్రమంలో భాగంగా ఎనర్జీఎస్ వారి ఆధ్వర్యంలో యరపతినేని , జంగా కృష్ణమూర్తి మొక్కలను నాటడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొక్కలను పెంచాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, ఎమ్ పి డి ఓ మరియు కార్యాలయం సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, మరియు దాచేపల్లి టౌన్ మండలంలలోని తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీల రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గం, మండల, గ్రామ, వార్డులలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు,యువత,మహిళలు, అభిమానులు, తదితరులు పాల్గొనటం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.