నారద వర్తమమానసమాచారం
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ:
సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 3 నుంచి 12 వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే సుజనాచౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అక్టోబర్ 3 – బాలా త్రిపురసుందరిదేవి
అక్టోబరు 4 – గాయత్రీ దేవి
అక్టోబరు 5 – అన్నపూర్ణ దేవి
అక్టోబరు 6 – లలిత త్రిపుర సుందరి దేవి
అక్టోబరు 7 – మహాచండీ దేవి
అక్టోబరు 8 – శ్రీమహలక్ష్మి దేవి
అక్టోబరు 9 – సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
అక్టోబరు 10 – దుర్గాదేవి
అక్టోబరు 11 – మహిషాసుర మర్దిని
అక్టోబరు 12 శ్రీ రాజరాజేశ్వరిదేవి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.