నారద వర్తమాన సమాచారం:డిల్లీ :ప్రతినిధి
ఢిల్లీ సీఎంగా కేజ్రివాల్ సతీమణి!
మద్యం విధానానికి సంబం ధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తిహాడ్ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి.
ఈడీ కస్టడీలో వల్లే కేజ్రీవాల్ జైలు నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారని ఆ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆ బాధ్యతలు ఎవరు చేపడ తారని ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఎవరు అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంత రించుకుంది. ఈ నేపథ్యంలో నే తెరపైకి కొంత మంది పేర్లు వస్తున్నా అరవింద్ కేజ్రీ వాల్ సతీమణి సునీత పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
మరో వైపు సునీతా కేజ్రీ వాల్‌కు సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి ఆమె ఐఆర్‌ఎస్ అధికారి ణిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.
ఆమె ఉన్నత చదువులు చదివారు ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది ఎన్నికల ప్రచారం లోనూ చురుగ్గా పాల్గొన్నారు. కేజ్రీవాల్ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ కూడా జైలులో ఉన్నారు. దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.