నారద వర్తమాన సమాచారం
నాటు బాంబు తయారీదారుల ఐదుగురు మూట సభ్యులను అరెస్టు చేసిన హుస్నాబాద్ పోలీసులు
కేసు వివరాలు వెల్లడించిన హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను
నాటు బాంబులను తయారు చేస్తున్న వ్యక్తితోపాటు జంతువులు, వణ్యప్రాణులను వేటాడుతున్న (Poachers) ముఠాను పట్టుకుని ఐదుగురి వ్యక్తులను రిమాండ్ కి తరలించినట్లు హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను తెలిపారు. హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశన్ని నిర్వహించి వివరాలు సీఐ శ్రీను వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం మీర్జపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులు గుట్ట పక్కన ఉన్న వ్యవసాయ క్షేత్రాల వద్ద జంతువులు, వన్యప్రాణులు కోసం నాటు బాంబులు పెట్టారు. ప్రమాదవశాత్తు ఆ బాంబు పేలి అదే గ్రామానికి చెందిన ఎమ్.డి.ఖలిం వ్రేళ్ళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
బాధితుడు అన్న తాజుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశామన్నారు. మీర్జాపూర్ గ్రామంలోనీ ఓ ఇంటిలో నాటు బాంబులు ఉన్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లడంతో నాటు బాంబులు దొరికాయని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.