Thursday, November 21, 2024

దసరా ఉత్సవాలలో మూడవ రోజు అమ్మవారి శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకారం

నారద వర్తమాన సమాచారం

దసరా ఉత్సవాలలో మూడవ రోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు

. శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం (05-10-2024)

దసరా ఉత్సవాలలో మూడవ రోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి.

మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు “అమ్మ” అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము.

ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

‘అన్నపూర్ణే, సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే’ అంటూ కొలిచే ఈ అమ్మ మన అందరికీ ఇంటిలో కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. లోకాలకు క్షుదార్తి తీర్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి. శివుడంతివాడికే అమ్మయై భిక్ష వేసింది. ఆమె సంతానంలాటి మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నిస్తుంది.

ఆహారానికి శక్తి ఉంటుంది. శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది. మన మనస్సు కూడా ఆహారంయొక్క స్వరూపమే. ఆహారాలు 3 రకాలుగా ఉంటాయి. సాత్విక, రాజస, తామసాలు. శక్తిలేని ఆహారాన్ని మనం స్వీకరించం. అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోను అలాగే తినే ఆహార పదార్థాలలో ఉండేటటువంటి అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రులలో గుర్తుచేసుకోవడం. ఉపనిషత్తులు అన్నమే బ్రహ్మగా వర్ణించాయి. (అన్నం బ్రహ్మేతి వ్యజానాత్) అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తున్నాయని చెప్పాయి. అటువంటి అన్నాన్ని నిందించడం, పరీక్షించడం, వదిలిపెట్టడం వంటివి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెపుతున్నాయి. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని (అన్నాన్ని) స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది.

సాత్వికమైన హిత, మిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయని అందరు ఆధ్యాత్మిక వేత్తలు చెపుతున్నమాటే. ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతార విశేషం. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం.అమ్మవారు లేత గంధపురంగు లేదా పసుపు రంగు చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం దద్దోజనం, క్షీరాన్నం, అల్లం గారెలు. ఇది వాతాన్ని హరిస్తుంది. శ్రమను పోగొడుతుంది. గుండె నీరసాన్ని తగ్గిస్తుంది. కఫ, పైత్యములను తగ్గిస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది. శరీర కాంతిని పెంచుతుంది. కడుపులో తాపాన్ని పోగొడుతుంది. కిడ్ని వ్యాధుల్ని కూడా నివారిస్తుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading