నారద వర్తమాన సమాచారం
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన విదేశీయుల బృందం
నరసరావుపేట
పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను విదేశీ బృందం ఆదివారం పర్యటించారు. పల్నాడు జిల్లాలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం గ్రామం, రాజుపాలెం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం, పెదకూరపాడు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి మోడల్స్ మరియు కాంపాక్ట్ బ్లాక్స్ ఆదివారంఅమెరికా నుంచి పెగాసెస్ క్యాపిటల్. అడ్వైసర్ క్రేగ్ కాట్ , కీత్ అగోడ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సి ఈ ఓ స్పెయిన్ విదేశీ బృందం తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు టి విజయకుమార్ సందర్శించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె . అమల కుమారి ముందుగా వారికి ప్రకృతి వ్యవసాయం సార్వత్రిక సూత్రాలను వివరించడం జరిగింది. తరువాత బృందానికి బీజామృతం, ద్రవజీవామృతం నీమాస్త్రం తయారు చేసి చూపించడం వాటి వలన రైతులకు, భూమికి పర్యావరణానికి కలుగు ప్రయోజనాలను వివరించడం జరిగింది. తరువాత కె. జ్యోతి నిరంతరం ఆదాయం ఇచ్చే మోడల్(ఏ.టి.ఎం) సూర్యమండలం మోడల్ లో 27రకాల కూరగాయ పంటలు ఆకుకూరలు, దుంప జాతి ,తీగజాతినూనె, జాతి పూల రకాలు వివిధ రకాల పంటలను 20 సెంట్లు పొలంలో వేసి నిరంతరం 365 రోజులు ఈ మోడల్ ద్వారా నెలకు 5000 నుండి10000 రూపాయలు వరకు ఆదాయం వస్తుందని ఆ బృందానికి మహిళా రైతు తెలిపారు. భూమిలో వివిధ రకాల పలు పంటలు వేయడం వలన జీవవైవిద్యం పెరిగి భూమి సారవంతమవుతుందని,చీడ పీడల ఉధృతి తక్కువగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. గ్రామంలోని టి మాధవి వరి ఏ గ్రేడ్ మోడల్ కంపాక్ట్ బ్లాక్ లోని క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ క్షేత్రంలో గట్లపై అరటి కొబ్బరి, బొప్పాయి, జామ, బంతి అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి మరియు తీగజాతి వేయడం జరిగింది గట్లపై అంతర పంటలు వేయడం ద్వారా వరి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలియజేయడం జరిగింది. స్వయం సహాయక సంఘం లోని మహిళా రైతు గారు టీ. సావిత్రి ప్రకృతి వనరుల కేంద్రాన్ని సందర్శించి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రైతు సాధికార సంస్థ శ్రీ. టి. విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రతి గ్రామ సమైక్య పరిధిలో ప్రకృతి వనరుల కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు ఘనజీవామృతం అన్ని రకాల కషాయాలు అందుబాటులోనికి తీసుకురావాలని సూచించడం జరిగింది. తరువాత కంది ఏ గ్రేడ్ మోడల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి కంది పంటలో 5నుండి10 రకాల అంతర పంటలు వేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరి రైతు జీవన విధానం మెరుగుపడుతుందని సూచించడం జరిగింది. అంతేకాకుండా భూమిలో అన్ని రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ద్వారా భూమి సారవంతం అవుతుందని ప్రధాన పంటకు చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. అనంతరం నాగిరెడ్డిపాలెం గ్రామంలోని రైతు సేవా కేంద్రం లో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సందర్శించడం జరిగింది అనంతరం మహిళా సంఘాల సభ్యులతో ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి చర్చించడం మరియు గర్భిణీలు బాలింతలకు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఉత్పత్తులను ప్రతినెల స్వీకరించడం ద్వారా వారికి సుఖ ప్రసవం జరుగుతుందని రక్తహీనత ఉండదని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలియజేయడం జరిగింది.
అనంతరం రాజుపాలెం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్రాల మల్లికార్జున పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కందిలో రెండు వరుసల మధ్యలో వివిధ రకాల అంతర్ పంటలు వేసిన విధానాన్ని పరిశీలించారు రెండు కంది వరుసల మధ్యలో గోరుచిక్కుడు, సజ్జ బెండ, మునగ, పెసర వీటితోపాటు 25 రకాల బయోడైవర్సిటీ పంటలు వేసుకోవడం వల్ల నేలలో జీవవైవిద్యం ఏర్పడి రసాయన కేరువులు ఉపయోగించకుండా అని మొక్కలన్ని ఆరోగ్యంగా ఏ పోషకాలు లోపం లేకుండా పెరగటం గమనించడమైనది. ఇలా వేసుకోవడం వల్ల ఒక ఎకరంలో ఒక పంట దిగుబడుకు బదులు ఐదు పంటల దిగుబడి తీసుకోవచ్చునని చీడపీడల కూడా ఆశించవని. పలు రకాల పంటల వల్ల జీవవైవిద్యంతో పాటు మిత్ర పగులు కూడా ఆకర్షించబడి రసాయనకు పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదని. తద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగిబండ్లు పొందవచ్చునని తెలియజేశారు. అంతరం పెద్దకూరపాడు మండలంలోని పెదకూరపాడు గ్రామంలో అమూల్య మహిళా రైతు పొలంలో గత ఆగస్టు మాసం 31వ తేదీన కురిసిన అధిక వర్షాలకు మరి వరదలకు మునిగిపోయిన ప్రకృతి వ్యవసాయ ప్రతిఫలాలను పరిశీలించారు ఆ ప్రక్కనే ఉన్న రసాయన విధానంలో చేస్తున్న ప్రతితో పోలిస్తే ప్రకృతి వ్యవసాయ ప్రతి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చాలా ఆరోగ్యంగా ఉందని , ఒక మొక్కకు పూత పిందే కాయలు 42 గా అదే రసాయనక వ్యవసాయం చేస్తున్న మొక్కలకు 20 కాయలు మాత్రమే ఉన్నాయని , బ్రిక్స్ వాల్యూ ప్రకృతి వ్యవసాయ పొలాలకు 15 ఉంటే రసాయనకు వ్యవసాయం చేస్తున్న పొలాలకు ఎనిమిది ఉందని అలాగే నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం కూడా ప్రభుత్వ ఆశా విధానాలు చేసిన నేలలకు ఎక్కువగా ఉందని తెలియజేశారు. కావున ప్రతి రైతు ప్రస్తుతము ఈ జిల్లాలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానంలో వస్తున్న మంచి ఫలితాలను గమనించి ప్రతి రైతు కూడా ప్రకృతి వైశా విధానాన్ని అవలంబించాలని కోరారు. పల్నాడు జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ విధానం చూసి అమెరికా బృందం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమల కుమారి మరియు వారి బృందానికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ సభ్యులు వెన్న సీతారామిరెడ్డి,బాబు, అడిషనల్ డీపీఎం ప్రేమ్ రాజు, ఎన్ ఎఫ్ ఎస్ మహిళా సంఘాల సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.