నారద వర్తమాన సమాచారం
మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టుల మృతి..
30 తుపాకుల స్వాధీనం..
దంతెవాడకు మృతదేహాలు
15 మృతదేహాల గుర్తింపు.. వీరిపై రూ.1.30 కోట్ల రివార్డు
50 -70 మంది ఉన్నట్లుగా సమాచారం రావడంతో బలగాల కూంబింగ్
వెల్లడించిన బస్తర్ ఐజీ సుందర్‌రాజన్
అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు శనివారం దంతెవాడ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ బస్తార్ ఐజీ పి. సుందర్‌రాజన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టులో 13మంది మహిళలున్నారని వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ పీఎల్‌జీఎ 6బెటాలియన్ సభ్యులని తెలిపారు. మృతుల్లో ఇప్పటివరకు 15 మందిని పోలీసులు గుర్తించారు.
వీరిపై రూ.1.30 కోట్లు రివార్డు ఉందని ఐజీ తెలిపారు. ఇంకా 16మంది మావోయిస్టులను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు చెందిన 30 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అబూజ్‌మడ్ అడవుల్లో సుమారు 50నుంచి 70మంది మావోయిస్టులు సమావేశమైనట్లు సమాచారం రావడంతో ఎస్టీఎఫ్, బీఎ్‌సఎఫ్, బీఆర్‌జీ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేందూరు, తూలితూలి అడవుల్లోకి జవాన్లు చేరుకోగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా బలగాలు ఎదురుకాల్పులు నిర్వహించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయన్నారు.
ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో ఒక ఐఎంజీ మిషన్‌గన్, 4 ఏకే 47గన్స్, ఇతర తుపాకులు, బులెట్లు, బీజీయల్స్, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. దండకారణ్య కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఉర్మిళపై రూ.21లక్షల రివార్డు ఉందని ఐజీ తెలిపారు. ఇప్పటికి గుర్తించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఎవరూ లేరని, మిగతా వారి గుర్తించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని వెల్లడించారు. కాగా ఈ ఎన్‌కౌంటర్ ఆపరేషన్ తెలంగాణకు చెందిన అడిషనల్ ఎస్పీ స్మృతిక్ రాజనాల ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆయన దంతెవాడ జిల్లా ఏఎస్పీ (ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.
మృతుల వివరాలు
- పాలసీ (డీకేఎస్ జెడ్సీ), 2, సురేష్ సలాం (డీవీసీఎం), 3. మీనా మడకం (డీవీసీఎం), 4. అర్జున్ (పీపీసీఎం, పీఎల్‌జీఎ కంపెనీ), 5. అంద మైనా (పీపీసీఎం పీఎల్‌జీఎ కంపెనీ, 6. భుద్రాం (పీపీసీఎం, పీఎల్‌జీఎ కంపెనీ,) 7, సుక్కు (పీపీసీఎం, పీఎల్‌జీఎ కంపెనీ), 8. సోహాన్ (ఎసీఎం భరోసు ఏసీ), 9. ప్లవర్స్ (పీపీసీఎం పీఎల్‌జీఎ కంపెనీ), 10. భసంతి (పీపీసీఎం, పీఎల్‌జీఎం కంపెనీ), 11. కోసీ (పీపీసీఎం పీఎల్‌జీఎ కంపెనీ), 12, జమీలా అలియాస్ బుద్రి (పీఎం పీఎల్‌జీఎ కంపెనీ), 13. రాండర్ (ఎసీఎం), 14. సుక్లు అలియాస్ విజయ్ (ఎసీఎం), 15. జమ్లీ (ఎసీఎం), 16. సోనూ కోర్రం (ఎసీఎం ఆడ్మే)..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.