Thursday, November 21, 2024

కాత్యాయనీ దుర్గాదేవి నవదుర్గల్లో ఆరవ అవతారం

నారద వర్తమాన సమాచారం

కాత్యాయనీ దుర్గాదేవి నవదుర్గల్లో ఆరవ అవతారం

కాత్యాయని దుర్గా దేవి..🔱

కాత్యాయనీ దుర్గాదేవి నవదుర్గల్లో ఆరవ అవతారం. నవదుర్గాలలో ఒకటిగా , కాత్యాయని దుర్గా దేవి ఆరాధన నవరాత్రి ఆరవ రోజున జరుగుతుంది.

సింహ వాహనంపై అధిరోహించి ఖడ్గాన్ని చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షణిగా కాత్యాయనీ దేవి శోభిల్లుతుంది.

బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణియై విరాజిల్లుతూ కాత్యాయని దుర్గాదేవి అంశగా పూజలందుకుంటుంది.

పురాణం కధనం ప్రకారం :

పూర్వం ‘కత’ అనే మహర్షికి, దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. అతనికి ‘కాత్య’ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవర్చుకున్న ఆయనకే ‘కాత్యాయునుడు’ అని పేరు వచ్చింది.

ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేస్తాడు. దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది. కాత్యాయునుడుకి పుత్రికగా జన్మించుట చేత ఆ తల్లి కాత్యాయనిగా పేరు గాంచింది.

మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోకకల్యాణం గావించారు.

అనేకమంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయనీదేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్ధాలు సిద్ధిస్తాయి.

మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంధాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం.

ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావిస్తూ ఓడిశా ప్రదేశం జగన్నాధునికీ, కాత్యాయనీ దేవికి పీట వంటిది అని వివరించారు.

హిందూ శాస్త్రాలు ప్రకారం కాత్యాయనీ దేవి అజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం.

ధ్యాన శ్లోకం

చంద్రహా సోజ్జ్వల్ కరా శారదూల్ వార్వాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్ దేవీ దానవఘటినీ ||

భావం: చంద్రహాస ఖడ్గాన్ని చేత పట్టుకుని, సింహంపై అధిరోహించి, రాక్షసులను సంహరించే దేవి కాత్యాయనీ, నాపై దయ చూపుము.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading