నారద వర్తమాన సమాచారం
హరియాణాలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి రంగం సిద్ధం?
హర్యానా :-
హర్యానాలో అధికార బీజేపీకి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి మూడవసారి అధికారాన్ని చేజిక్కించు కుంది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 90 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్ డి 2, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును స్థానిక పార్టీలు, ఇండిపెం డెంట్లు చీల్చాయి. దీంతో బీజేపీ సులభంగా విజయం సాధించింది. జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి మెజార్టీ సీట్లు దక్కాయి.
దీంతో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో మొత్తం 90 స్థానాల్లో మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా నేత్రుత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమెక్ర టిక్ పార్టీకి 3 స్థానాలు , జమ్మూకశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఒకటి, సీపీఐకి 1 స్ధానం, ఆమ్ ఆద్మీ పార్టీకి 1 సీటు, స్వతంత్ర అభ్యర్థులకు 7 స్థానాలు దక్కాయి. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.
దీంతో ఎక్కువ సీట్లు వీరికే వచ్చాయి. కాబట్టి త్వరలో నే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతంది.ఇక జమ్మూకశ్మీర్ లో బీజేపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీజేపీ కార్య కర్తలకు అభినందనలు తెలిపారు.
అదే సమయంలో, నేషనల్ కాన్ఫరెన్స్ అద్భుతమైన పనితీరును కనబరిచి నందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రధాని మోదీ అభినందన సందేశంపై ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. జమ్మూ కశ్మీర్‌లో ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని ప్రధాని మోదీ అన్నారు.
ఆర్టికల్ 370, 35(ఎ) రద్దు తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు జరగ్గా, భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీని వల్ల ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం వెల్లివిరి సింది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పనితీరు చూసి గర్వపడు తున్నానని ప్రధాని మోదీ అన్నారు. మా పార్టీకి ఓటు వేసిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపు తున్నాను.. జమ్మూ కాశ్మీర్ సంక్షేమం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాను అని ప్రధాని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.