నారద వర్తమాన సమాచారం
ఉపాధ్యాయులే తెలంగాణకు వారధులు,నిర్మాతలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ
ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, స్వరాష్ట్రం ఏర్పాటు జరిగినా గత పదేళ్ళలో నిరుద్యోగ సమస్య తీరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్య గాలికి వదిలే సిందని ఆయన విమర్శిం చారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సిఎం రేవంత్ పాల్గొన్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో 10 వేల మందికి పైగా నూతన ఉపాధ్యాయులకు నియా మక పత్రాలను అందిం చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణకు ఉపాధ్యా యులే వారధులు, నిర్మాత లని, పేద విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత మీదేనని, మంత్రు లుగా, ముఖ్యమంత్రిగా మాకు ఉద్యోగాలు ఇచ్చిన మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాల అవాంతరాలను తిప్పికొట్టి టీచర్ల నియామ కాలు చేశాం, విద్యా రంగంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిం చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ నియామకాలను అడ్డుకునేందుకు ప్రతి పక్షాలు ప్రయత్నించాయనీ, అయితే అన్నీ అవాంత రాలనూ వ్యూహాత్మకంగా తిప్పి కొట్టి, అనుకున్న సమాయానికి నియామ కాలను పూర్తి చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి, వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.