నారద వర్తమాన సమాచారం
విజయదశమికి పాలపిట్టకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
దసరా రోజు ప్రజలు తప్పకుండా పాలపిట్టను దర్శనం చేసుకుంటారు. గ్రామాల్లో అయితే.. పొలాల్లో, చెరువు గట్టుల్లో ప్రత్యేకంగా పాల పిట్ట దర్శనం చేసుకుంటుం టారు. పట్టణాల్లో అయితే డబ్బులిచ్చి మరీ దర్శనం చేసుకుంటుంటారు.
దసరా రోజు పాలపిట్టను చూస్తే.. ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు కూడా. ప్రజల సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది, కూడా.
మరి ఇంత ప్రాధాన్యమి స్తోన్న పాలపిట్టకు దసరా పండుగ సంబందమేంటీ అన్నది.. ప్రస్తుతమున్న యువతకు చాలా మందికి తెలియదు.మరి తెలుసుకుందామా?
పూర్వం పాండవులు జూదం ఆడి.. రాజ్యాన్ని కోల్పోయాక కౌరవులు, పాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్య వాసం, అజ్ఞాతవాసం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ రెండూ ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా.. పాండ వులకు దారిలో పాలపిట్ట కనిపించిందని చెప్తుంటారు.
అలా.. పాండవులు అరణ్య వాసం, అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వచ్చిన రోజునే విజయ దశమి పండుగగా జరుపుకుంటారని, పురాణాలు చెప్తుంటాయి.
అయితే.. ఆ రోజు వాళ్లు తిరిగి వచ్చేటప్పుడు పాలపిట్ట కనిపించటం మూలానే.. అనంతరం జరిగిన కురుక్షేత్రం యుద్ధంలో విజయం సాధించినట్టు పాలపిట్టను చూసినందుకే పాండవులకు విజయం సిద్ధించిందని నమ్ముతుంటారు.
అలా దసరా రోజున ప్రత్యేకంగా పాలపిట్టను చూస్తే.. జీవితంలో తల పెట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుందని నమ్మకం. దీంతో.. ప్రజల్లో ఇదో ఆచారంగా మారిపోయింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.