నారద వర్తమాన సమాచారం
గుంటూరు జిల్లా లో మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారు 14వ తేదీ ఉదయం ఏడు గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో లాటరీ నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ లాటరీ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.
పల్నాడు జిల్లాలో కూడా అదే రోజు ఉదయం ఏడు గంటలకు టౌన్ హాల్లో లాటరీ విధానం కొనసాగుతుందని చెప్పారు.
గుంటూరులో 127 షాపులకు 4448 అప్లికేషన్లు, పల్నాడు జిల్లాలో 127 షాపులకు 2638 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు.
మంగళగిరి పరిధిలో అత్యధిక అప్లికేషన్లు వచ్చాయని, మాచర్ల పరిధిలో అతి తక్కువ అప్లికేషన్లు వచ్చాయని వెల్లడించారు.
ఈ అప్లికేషన్ల ద్వారా గుంటూరు ,పల్నాడు జిల్లాలలో ప్రభుత్వానికి 141 కోట్లు ఆదాయం వచ్చింది అన్నారు.
మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 7 గంటలకే లాటరీ జరిగే ప్రదేశానికి రావాలని కోరారు.
లాటరీ లో మద్యం షాపు దక్కించుకున్న వారు 1/6 పేమెంట్ చేయాలని,లైసెన్స్ అక్కడే జారీ చేయడం జరుగుతుంది అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.