నారద వర్తమాన సమాచారం
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ తల్లి విగ్రహం ధ్వంసం
రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా?
తెలంగాణ
సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొం దరు దుండగులు కాలుతో తన్నుతూ పూర్తిగా ధ్వంసం చేశారు.
ఆదివారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న ముగ్గురిలో ఒకరిని స్థానికు లు పట్టుకున్నారు.దేహశుద్ధి చేసిన అనంతరం దుండ గుడిని పోలీసులకు అప్పగించారు.
ఇప్పుడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ధ్వంసం ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్లో ఉన్న ముత్యా లమ్మ ఆలయంలోకి వెళ్లిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన ఘటన ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. హిందు సంఘాలంతా దీని పై మండిపడుతున్నాయి. అంతేకాదు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. అంతేకాదు ఎక్కడ కూడా శాంతిభద్ర తలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తదితరులు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. ముఖ్యంగా రాజాసింగ్ ను ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు.
పోలీసులు. అయితే ఈ ఘటనపై కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచా రం. ఈమధ్య కాలంలో హిందూ ఆలయాలు, హిందువులను టార్గెట్ చేసిన కొంతమంది రెచ్చిపోతున్నారని హిందూ సంఘాలు మండిపడుతు న్నాయి.
ఓవైపు లవ్ జీహాద్, మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దాడులు చేస్తున్నారంటూ హిందూ సమాజం ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈఘటన ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.