నారద వర్తమాన సమాచారం
త్వరలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ?
తెలంగాణ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఈనెల ఆఖరిలోపు పూర్తిచేయా లనే లక్ష్యంతో హై కమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది, ఈనెల 17న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆధ్వర్యంలో సిడబ్ల్యుసి సమావేశం నిర్వహించను న్నారు.
దీనిలో భాగంగా సోమ వారం పిసిసి అధ్యక్షులు మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే 50 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు.
పారిశ్రామిక అభివృద్ధిపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని అన్నా రు.అంతేకాదు.. అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ కావాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్ జిల్లాకు త్వరలో యంగ్ ఇండియా కాలేజీ రాబోతోందని కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చలు జరిపారు.
ఈ ప్రక్రియ ఇప్పటికే కొలిక్కి వచ్చినట్లు సమాచారం. దసరా రోజున ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు.కాని ఈ అంశంఫై హై కమాండ్ తో చర్చించినప్పటికీ ఏకాభి ప్రాయం కుదరకపోవడంతో జాప్యం జరిగినట్లు తెలుస్తుంది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.