పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షా సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. గురజాల నియోజకవర్గం లోని రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్లపై సమీక్ష చేశారు. వీలైనంత త్వరగా రోడ్ల పనులను మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించి, మొత్తం రోడ్ల గ్రాంట్లపై సమీక్ష చేశారు.
ఈ సమీక్షలో పల్నాడు జిల్లా ఆర్ అండ్ బి ఈఈ ఆర్.రాజా నాయక్ మాచర్ల డిఈఈ బీవీ రమణయ్య , దాచేపల్లి ఇన్చార్జ్ ఏఈఈ సుబ్బారావు , పిడుగురాళ్ల ఆర్ అండ్ బి ఏఈఈ యూసఫ్ పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.