నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
🚦🚔రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి — పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు.🚦🚔
ఈరోజు శ్రీ పల్నాడు జిల్లా ఎస్పీ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న SRKT గేటు నుండి చిలుకలూరిపేట హైవే వరకు రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాలను గుర్తించి పోలీసు అధికారులకు తగు సూచనలను ఇవ్వడం జరిగింది.
రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం
ప్రజలు రోడ్డు ప్రమాదల బారిన పడకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు.
గురువారం నాడు చిలకలూరిపేట నియోజక వర్గంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రమాదాలు సంభవించే ప్రాంతాలైన పట్టణంలోని ఏ ఏం జి చెక్ పోస్టు,ఆర్టీసీ బస్టాండ్,అడ్డరోడ్డు,
కొండ్రుపాడు , నరసరావుపేట సెంటర్, పసుమర్రు, కావూరు,లింగంగుంట్ల,బొప్పిడీ గ్రామాల సమీపంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న
ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెబుతూనే వాహన దారులు, డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని వారితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేయ వలసిందిగా ఎస్పి చిలకలూరిపేట అర్బన్, చిలకలూరిపేట రూరల్ సీఐ లను ఆదేశించారు.
మద్యం తాగి నిర్లక్ష్యం గా వాహనాలు నడిపే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా పట్టణ శివారు పరిధిలో అతి వేగంగా వాహనాలు నడపకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.
మైనర్ బాల బాలికలు వాహనాలు నడిపితే కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచనలు చేశారు.
మైనర్ బాలలు, విద్యార్థులు రాత్రి సమయాల్లో అనవసరంగా బైకులు మీద తిరగ కుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పలు సూచనలను ఎస్పీ కంచి శ్రీనివాసరావు అర్బన్, రూరల్ సీఐ లకు చేశారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట డిఎస్పి ఎై.నాగేశ్వరరావు , ఎస్.బి సి.ఐ బండారు సురేష్ బాబు , చిలకలూరిపేట అర్బన్ సి.ఐ పి రమేష్ బాబు , చిలకలూరిపేట రూరల్ సీ.ఐ బి. సుబ్బ నాయుడు చిలకలూరిపేట రూరల్ ఎస్.ఐ
జి.అనిల్ కుమార్ లు తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.