నారద వర్తమాన సమాచారం
ఓనస్ ఆసుపత్రి డాక్టర్లకు ఉత్తమ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని చంప పేట ప్రధాన రహదారిలోని ఓనస్ రోబోటిక్ మరియు హార్డ్ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజు నాయుడు అన్నారు. ఐబిజ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేల్లో ఓనస్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు రోబోటిక్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఫోర్త్ జెన్ ఫిజీషియన్ డాక్టర్ రవి కిరణ్ ఉప్పల లకు అవార్డులను ప్రకటించినట్లు తెలిపారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డులను అందుకున్నట్లు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు ఇవ్వడం వల్ల మాకు మరింత బాధ్యత పెరిగిందని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుండి ఆసుపత్రికి వివిధ రకాల రోగులతో మరియు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారు వస్తుంటారని వారందరికీ వారికి అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో అనేక అవార్డులు వచ్చినట్లు తెలిపారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.