Friday, November 22, 2024

పోలీస్ అమరవీరులారా మీకు వందనం. మీ అనిర్వచనీయ త్యాగానికి మా యొక్క సలాం…….

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్…

పోలీస్ అమరవీరులారా మీకు వందనం…. మీ అనిర్వచనీయ త్యాగానికి మా యొక్క సలాం…..

పల్నాడు జిల్లా ఎస్పీ  కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అక్టోబర్ 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమమును నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.

ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఐఏఎస్ ,జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఐఏఎస్  మరియు
నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు  చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

నర్సరావుపేట పట్టణంలోని కోడెల శివప్రసాదరావు మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో పల్నాడు జిల్లా ఏ ఆర్ డి.ఎస్.పి జి.మహాత్మగాంధీ  పర్యవేక్షణలో ఆర్.ఐ యం.రాజా  పరేడ్ కమాండర్ గా ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం సందర్భంగా స్మృతి పరేడ్ నిర్వహించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పోలీస్ అమర వీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన కె.అరుణ్ బాబు  మాట్లాడుతూ….

సమాజానికి పోలీసు వారు చేసే సేవలు అనిర్వచనం. పోలీస్ వ్యవస్థ లేని సమాజాన్ని మనం ఊహించలేం.
పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో సంఘవిద్రోహ శక్తుల ఆగడాలకు అడ్డువుండదు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారకాస్తు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తున్నారు.
ఈ క్రమంలో ఎంతోమంది పోలీస్ వారు సంఘవిద్రోహ శక్తులను అణచే క్రమంలో తమ ప్రాణాలను అర్పించి అసువులు బాసినారు. వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది.
ఈ సందర్భంగా సమాజ హితం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ మహావీరుల త్యాగాన్ని స్మరించుకోవడం మనకు ఎంతో గర్వకారణం వారి యొక్క స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ పోలీస్ శాఖ ప్రజలకు సమాజానికి మరిన్ని సేవలను అందిస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా పలనాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్  మాట్లాడుతూ…

21 అక్టోబర్ 1959 న భారత సైన్యం లఢక్ లోని హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో చైనా దురాక్రమణను కరమ్ సింగ్, D.S.P. నాయకత్వంలో సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టిన రోజు ఇది. ఈ సమరంలో కరమ్ సింగ్ తో పాటు 10 మంది భారత సైనికులు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, అక్టోబర్ 21 తేదిన అమర వీరుల సంస్మరణ దినంగా ఈ రోజుని జరుపుకుంటున్నాం.

ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఎంతో మంది సైనికులు మరియు పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ఎదుర్కొనే క్రమంలో ప్రాణ త్యాగం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 26 (వీరిలో 9 మంది పల్నాడు జిల్లా వారు) మంది పోలీసు వారు వీరమరణం పొందడం జరిగినది. వీరందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
వీరమరణం పొందిన పోలీసు వారి యొక్క కుటుంబ సభ్యులను ప్రతి సంవత్సరం పిలిచి వారిని సన్మానించుకుని, వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేస్తున్నాము.

పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని పునికి పుచ్చుకొని భవిష్యత్తులో సమాజానికి ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తామని పల్నాడు జిల్లా పోలీస్ తరఫున తెలుపుకుంటున్నానని అన్నారు..

ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు మరియు చిలకలూరిపేట నియోజకవర్గం శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు  మాట్లాడుతూ…

సరిహద్దుల్లో సైనికులు మరియు దేశంలోనీ పోలీసు వారు నిరంతర కృషి వలననే ప్రజలు నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు.
ఆ విధంగా పోలీసు వారు ప్రజలకు అండగా ఉంటూ కొన్ని దురదృష్టకర సంఘటనలో సంఘవిద్రోహ శక్తులను అణచే క్రమంలో అసువులు బాసి వీరమరణం పొందారు అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శం అని కొనియాడారు.

ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా వీర మరణం పొందిన ఒక ఎస్ఐ  మరియు 8 మంది పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి, వారికి పల్నాడు జిల్లా పోలీస్ శాఖ తరపున ఎస్పీ  మరియు కలెక్టర్ జ్ఞాపికలు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఎస్పీ , కలెక్టర్,జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరె తో పాటు అదనపు ఎస్పీ జె.వి.సంతోష్ (పరిపాలన విభాగం) , నరసరావు పేట డిఎస్పీ కె.నాగేశ్వర రావు ,సత్తెనపల్లి డీఎస్పీ యం.హనుమంతు రావు  సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading