నారద వర్తమాన సమాచారం
పోలియో చుక్కలు వేయించాలి_పోలియోను నిర్మూలించాలి:
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల అందరికీ పోలియో చుక్క లు వేయించి, పోలియోను నిర్మూలించుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు గురువారం ప్రపంచ పోలియో నిర్మూలన దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతరం ఆరోగ్య ఉప కేంద్ర కార్యాలయంలో పోలియోపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వాల కృషి వల్ల ఆరోగ్యశాఖ ఉద్యోగుల కృషి వల్ల పోలియో వ్యాధి తగ్గిపోయిందన్నారు కలుషితమైన నీరు తాగటం, కాళ్లు చేతులు కడగకపోవడం, మలం మీద వాలిన ఈగలు తిరిగి ఆహార పదార్థాల మీద వాడడం, రోగి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపించటం అపరిశుభ్ర ఆహారం తినటం వల్ల పోలియో వైరస్ సంక్రమిస్తుందని ఆయన పేర్కొన్నారు అపరిశుభ్రమైన వాతావరణంలో పెరిగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో పోలియో వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందన్నారు వ్యాధి లక్షణాలు గూర్చి ఆయన వివరించారు ఫ్లూ జ్వరం లాగా ప్రారంభమవుతుంది తీవ్రమైన జ్వరం కాళ్లు చేతులు విపరీతమైన నొప్పులు, తలనొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, పక్షవాతం, శ్వాస ఇబ్బంది, కాళ్లు చేతులు బలహీనంగా ఉండి కదల్చలేని పరిస్థితి ఉంటుంది పైన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య నిపుణులు ను సంప్రదించి తగిన చికిత చేయించుకోవాలన్నారు పోలియో చుక్కలు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాల్లో వేస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త డివి పద్మావతి ఆశా కార్యకర్తలు బ్రహ్మేశ్వరి శ్యామల గ్రామస్తులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







