నారద వర్తమాన సమాచారం
బెల్లంకొండ లో ఘనంగా “9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వారోత్సవాలు..! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయుర్వేద వైద్యాధికారిణి డా.కె. మేఘమాల….
బెల్లంకొండ :-
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఈరోజు 25/10/24 న అంగన్వాడి సెంటరు నందు ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరము మరియు అవగాహన సదస్సు జరిగినది.
ఈ అవగాహన సదస్సునందు మానవుని దైనందిన జీవితము. లో ఆయుర్వేదము యొక్క ప్రాముఖ్యత మరియు మహిళల యొక్క ఆరోగ్య సంబంధమయిన విషయములపై అవగాహన కల్పించ బడినది.
ఈ వైద్యశిబిరము నందు సుమారు 60 మందికి పిల్లలు మరియు మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమము ను ప్రభుత్వ ఆయుర్వేద వైద్య అధికారిణి డా. కె. మేఘమాల MD మరియు
డి. ప్రభుప్రసాద్ కాంపౌండరు నిర్వహించారు.
ఈ శిబిరమునందు అంగన్వాడి ఉపాధ్యాయులు శ్రీమతి అయేషా పర్వీన్ శ్రీమతి పార్వతి పాల్గొన్నారు.
డా. K. మేఘమాల
మెడికల్ ఆఫీసర్
గవర్నమెంట్ ఆయుర్వేదం డిస్పెన్సరీ
బెల్లంకొండ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.