నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారులోని పిల్లుట్ల జంక్షన్ వద్ద రాబడిన సమాచారం మేరకు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా 25 బాక్సుల జిలిటన్ స్టిక్స్ రవాణా చేస్తున్న ఎక్స్పోజిసివ్ గూడ్స్ వ్యాన్ స్వాధీనం
నలుగురు వ్యక్తులను అరెస్ట్ చూపిన పిడుగురాళ్ల పోలీసులు పరారీలో మరో వ్యక్తి
స్వాధీనం చేసుకున్న జిలిటన్ స్టిక్స్ విలువ 50,000/- రూ ఉంటుందన్నారు,
లైసెన్స్ మ్యాగజైన్ అడ్డం పెట్టుకొని ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా జిలిటన్ స్టిక్స్ వ్యాపారం చేస్తున్న వెన్నా రాజశేఖర్ రెడ్డి, ఆసిఫ్ అనే యువకులు,
ఈ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన సీఐ వెంకటరావు,
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు పిల్లుట్ల రోడ్ జంక్షన్ వద్ద ఈనెల 18 తారీకు తనిఖీలు చేయుచుండగా ఎటువంటి బిల్లులు లేకుండా హైదరాబాద్ నుండి దామచర్ల, పిడుగురాళ్ళకు అక్రమంగా తరలిస్తున్న జిలిటన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నామని, అదే రోజు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసామని ,
ఈరోజు నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో
మరో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసామని తెలియజేశారు, ఎటువంటి నియమ నిబంధన లేకుండా నేరుగా క్వారీ వారికి ఈ జిల్టన్ సిక్స్ ను అమ్ముతున్నారని
ఇలా అమ్మటం చాలా ప్రమాదకరమన్నారు
అక్రమ డబ్బు సంపాదన ధ్యేయంగా ఇటువంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను వెన్నా రాజశేఖర్ రెడ్డి ,ఆసిఫ్, అనే వ్యక్తులు అమ్ముతున్నారని ఈరోజు ఆసిఫ్ అనే యువకుడ్ని అరెస్ట్ చేసామని,
త్వరలోనే పరారీ లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేస్తామన్నారు, పల్నాడు ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమంగా పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న, అక్రమంగా దాచిన, ఉపేక్షించబోమని ఉక్కుపాదం మోపుతామని అన్నారు,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.