నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది అనే ప్రోగ్రామ్ ఈరోజు గామాలపాడు మరియు శ్రీనగర్ గ్రామాలలో నిర్వహించడం జరిగింది.
ఈ ప్రోగ్రాం లో మండల వ్యవసాయ అధికారి డి పాప కుమారి దాచేపల్లి వారు మాట్లాడుతూ
రసాయన ఎరువులు తగ్గించండి, జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వాడమని,
భూసార పరీక్ష చేయించుకొని సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించిన మోతాదులను వాడవలసిందిగా కోరారు.
రైతులు ఎరువుల వాడకాన్ని కొంచెం తగ్గించి జీవన ఎరువులు అయినా అజిటోబాక్టర్, మైకోరైజా, సూడోమోనాస్ మొదలగునవి ఉపయోగించి, అదేవిధంగా పచ్చిరొట్టె ఎరువులు అయినా జనుము, జీలుగ, పిల్లి పెసర వాడకం వలన భూసారం పెంచవచ్చు అని చెప్పారు. ప్రత్తి, కంది మరియు వరి పంటలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను వివరించారు.
తప్పకుండా రైతులు విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. కొద్దికొద్దిగా ఎరువులను తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని కోరారు.
అదేవిధంగా పత్తి పంటలో రసం పీల్చు పురుగులను గుర్తించడం జరిగిందని రసం పీల్చు పురుగుల నివారణకు పచ్చదోమకు ఎసిఫేట్, పేను బంకకు ఇమిడాక్లోప్రిడ్, తామర పురుగులకు ఫిప్రోనిల్, తెల్ల దోమకు ప్రోఫినోపాస్ వినియోగించుకొని రసం పీల్చు పురుగుల భారీ నుండి పంటను రక్షించుకోవాలని తెలియజేశారు.
జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పత్తిని సిసిఐ లో అమ్మాలనుకున్న రైతులు రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని, పత్తి ధర 7521 / క్వింటా కు ఉన్నవి అని, పత్తిని రైతులు లూసుగానే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని తెలియజేశారు.
ఈ ప్రోగ్రామ్ లో వ్యవసాయ, పశుసంవర్ధక, ప్రకృతి వ్యవసాయ, మార్కెటింగ్, రైతు సేవా కేంద్రాలలోని
VAA/VHA లు, ఆ గ్రామాలలోని రైతులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.