నారద వర్తమాన సమాచారం
సత్తనపల్లి
ప్రముఖ చిత్రకారుడు, మాజీ విలేఖరి శ్రీ జింకా రామారావు గారు (76) శుక్రవారం సాయంత్రం పరమపదించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం సత్తెనపల్లిలో ఆయన స్వగృహంలో మరణించారు. జింకా రామారావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఒక పద్మశాలి కుటుంబంలో 1946 నవంబర్ 26 వ తేదీన జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
సత్తెనపల్లిలో రమణా స్టూడియో పేరుతో ఒక స్టూడియోను నడుపుకుంటూ ఫోటోగ్రాఫర్ గా మరియు పెయింటింగ్స్ వేస్తూ ఒక చిత్రకారునిగా స్థిరపడ్డారు. మూడు దశాబ్దాలు పత్రికా విలేఖరి గా పని చేశారు. ఆయన వేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి పుస్తకంలోని పద్యాలకు అనుగుణంగా ఆయన వేసిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. మూడు దశాబ్దాలు పత్రికా విలేఖరి గా పని చేసిన ఆయన అందరి మన్ననలు పొందారు. తన చిత్రకళకు ఎన్నో అవార్డులు పొందారు. ఆయన మృతి పట్ల సత్తెనపల్లి పట్టణంలోని పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన మృతిపట్ల పద్మశ్రీ డా. కన్నెగంటి బ్రహ్మానందం, సత్తెనపల్లి న్యూస్ పత్రిక ఎడిటర్ మారూరి పుల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ నందా సాంబశివరావు, గంగారపు వెంకట్రావు, బిట్రా వేదాద్రి, టి పి కల్యాణరావు, ఉల్లం శేషగిరిరావు, మారూరి లింగారెడ్డి, జి. రంగారావు, డాక్టర్ పరశురామయ్య, డాక్టర్ జి. విజయసారధి, డాక్టర్ కిరణ్ కుమార్, సి హెచ్ పెంచలరెడ్డి, పి వి మురళి కిషోర్, జి. వేణుగోపాల్, జి. అమర్ నాథ్ తదితరులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
నిమ్మరాజు సంతాపం సీనియర్ జర్నలిస్టు జింకా రామారావు శుక్రవారం అకాలమరణం పట్ల సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో సినీ నటులు శ్రీ బ్రహ్మానందం అతిథిగా జరిగిన జర్నలిస్టుల సాంస్కృతిక కార్యక్రమం….. అలాగే ఇంకా పలు కార్యక్రమాల నిర్వహణ లో జింకా అందించిన సహకారం మరువలేనిది. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.