నారదా వర్తమాన సమాచారం
అమెరికా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని మంత్రి నారా లోకేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగింది. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు (CEOs), ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్‌లతో నారా లోకేష్ భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను నారా లోకేష్ వివరించారు.
కాగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ పర్యటన అమెరికా లో కొనసాగింది. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియాస్పోరా యుఎస్ ఇండియా ప్రతినిధుల సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే గూగుల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి, సంస్థ సిఈవో, వైస్ ప్రెసిడెంట్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.