నారదా వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్
అనిర్వచనీయ సేవలకు – ఆత్మీయ వీడ్కోలు
పల్నాడు జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ ది.31.10.2024 వ తేదీన ఉద్యోగ విరమణ పొందిన AR HC ఆట్ల వెంకయ్య .
ఉద్యోగ విరమణ పొందిన ఆట్ల వెంకయ్య ని ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ మరియు జిల్లా పోలీసులు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
ఉద్యోగ విరమణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కోవలసిన ఘట్టం.
ఇప్పటి వరకు ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేయుటలో తనమునకలై అహర్నిశలు శ్రమించి, ఒక్కసారిగా ఉద్యోగ విరమణ పొందటం కొంచెం బాధ కలిగినప్పటికీ, మిగిలిన జీవితం మన కొరకు మనం గడపడానికి వచ్చిన అవకాశంగా భావించి, కుటుంబం, బంధుమిత్రులతో కలిసి సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
పోలీస్ శాఖలో ఇన్ని రోజులు సేవలందించడానికి వారికి సహకరించిన కుటుంబ సభ్యులకు,బంధు మిత్రులకు కృతజ్ఞతలు అని తెలిపారు.
ఉద్యోగ విరమణ అనంతరం ఏ విధమైన అవసరం వచ్చిన మీకు, మీ కుటుంబ సభ్యులతోపాటు మేము కూడా తోడుంటామని, ఏ అవసరం వచ్చిన పోలీస్ శాఖ తరపున మా వంతు సహాయాన్ని అందిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ, ఆహ్లాదకరంగా గడపాలని తోటి ఉద్యోగులు మరియు పల్నాడు జిల్లా పోలీస్ వారు కాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ జె .వి సంతోష్ AR DSP మహాత్మ గాంధీ రెడ్డి మరియు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాణిక్యాలరావు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.