Friday, November 22, 2024

నరసరావుపేట నియోజకవర్గంలో రోడ్ల మారమ్మత్తుల కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ

నారద వర్తమాన సమాచారం

నరసరావుపేట

నరసరావుపేట నియోజకవర్గంలో రోడ్ల మారమ్మత్తుల కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రోడ్ల బాగు కొరకు ₹826 కోట్ల బడ్జెట్ కేటాయింపు

ప్రతి జిల్లాలో సమంతరంగా రోడ్డు రిపేర్ పనులు జరిగేలా కార్యనిర్వాహన

నరసరావుపేట నియోజకవర్గం పట్టణంలో మరియు గ్రామాలలో పర్యటించిన నరసరావుపేట శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పట్టణంలో బాలయ్య నగర్.ఎన్జీవో కాలనీ.60అడుగుల రోడ్ నరసరావుపేట మండలంలో లింగంగుంట్ల పెట్లూరివారిపాలెం గ్రామాలలో శనివారం పర్యటించారు పట్టణంలో పలు వార్డులలో రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల మరమ్మతుల పనులను అదేవిదంగా నరసరావుపేట మండలం పెట్లురివారిపాలెం నుండి కోటప్పకొండ వెళ్లే రోడ్ మరమ్మతుల పనులను ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర‌వ్యాప్తంగా అడుగుకో గుంత‌.రోడ్లు అధ్వానంగా మారితే త‌ట్ట‌డు మ‌ట్టి కూడా వేసిన పాపాన పోలేదు.ఈ గుంతలా వల్ల రాష్టంలో చాలామంది ప్రాణాలను కోల్పోయారు ప్రజలపై చెత్త పన్ను భారం మేపి చెత్త పన్నులను వసూల్ చేయడమే కానీ ఎక్కడ చెత్త తీసిన దాఖలాలు లేవన్నారు.అదేవిదంగా నియోజకవర్గంలో గుంతల రోడ్లు,చెత్తాచెదారం కనిపించకూదాని అధికారులకు ఎమ్మెల్యే అరవింద బాబు ఆదేశించారు పట్టణం మరియు గ్రామాలు సుందరంగా తీర్చి దిద్దడంలో మీ పాత్ర చాలా కీలకం.మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలన్నారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించను అని ఎమ్మెల్యే చదలవాడ హెచ్చరించారు.కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినా ప్రతి హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నాదానిన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలో మున్సిపల్ కమీషనర్ జస్వంత్ రావు మండల పరిధిలో ఆర్&బి అధికారులు మరియు టీడీపీ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading